![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -52 లో.....పారిజాతం ప్లాన్ చేసి మరి బంటుని ఇంట్లోకి తీసుకొని వస్తుంది. నా తలపై దొంగ కొట్టబోతుంటే అప్పుడే బంటు నన్ను కాపాడి తన తలకి గాయం చేసుకున్నాడు. ఇక వీడు ఈ ఇంట్లోనే ఉంటాడని పారిజాతం అనగానే వద్దని శివన్నారాయణ అంటాడు. ఎందుకు వద్దు దీప సుమిత్రని కాపాడిందని ఇంట్లో పెట్టుకున్నారు కదా తను ఉంది కాబట్టి వీడు ఉంటాడు.. లేదంటే దీపని పంపించండి అని పారిజాతం అంటుంది. నువ్వు వెళ్లి రేపు ప్రొద్దున రా అని బంటుతో పారిజాతం అంటుంది. ఆ తర్వాత బంటుని అత్తయ్య ఇంట్లోకి తీసుకొని వచ్చిందంటే.. దీపని ఇంట్లో నుండి పంపించడానికే అయి ఉంటుంది. కొంచెం జాగ్రత్త గా ఉండాలని సుమిత్ర అనుకుంటుంది.
కాసేపటికి సుమిత్ర దగ్గరకి దీప వెళ్తుంది. శౌర్యా చదువు గురించి నీతో మాట్లాడాలని ఆయన పిలిచారని సుమిత్ర అంటుంది. అప్పుడే దీప అంటూ అనసూయ అరస్తు లోపలికి వస్తుంది.. ఏమైంది అత్తయ్య అని దీప అనగానే.. నన్ను అలా పిలవకు.. నీకు మాకు ఏం సంబంధం లేదు. నీ బ్రతుకుని ప్రశ్నించనప్పుడు నువ్వు ఎందుకు మా బతుకుల్లోకి రావడమని అనసూయ అంటుంది. నువ్వు ఇది అడగలిసింది దీపని కాదు నీ కొడుకుని అడుగు అని సుమిత్ర అంటుంది. ఈవిడ దీప అత్తయ్య తన కొడుకుకి బుద్ది చెప్తానంటూ వెళ్లి కొడుకు దగ్గరే ఉండిపోయిందని సుమిత్ర అంటుంది. నిన్నటి నుండి స్టేషన్ లో శోభ, నేను వాళ్ళని బ్రతిమిలాడుతూనే ఉన్నాం.. మాతో పని అవట్లేదని నీ దగ్గరకి వచ్చాను.. పదా స్టేషన్ వచ్చి నా కొడుకుని విడిపించూ అని అనసూయ అనగానే.. నేను విడిపంచడమేంటని దీప అడుగుతుంది. నా కొడుకుపై కేసు పెట్టి ఏం తెలియనట్టు భళే నటిస్తున్నావని అనసూయ అంటుంది. నేను కేసు పెట్టలేదని దీప అంటుంది.. నేను పెట్టలేదని సుమిత్ర అంటుంది. కేసు ఎవరో పెట్టారో నాకు తెలుసని పారిజాతం అంటుంది.
ఇంకెవరు పెడతారు.. నా మనవడు అని పారిజాతం అంటుంది. కార్తీక్ కి దశరథ్ ఫోన్ చేసి కేసు తనే పెట్టాడో లేదో కనుక్కోవాలని అనుకుంటాడు. కానీ కార్తీక్ లిఫ్ట్ చెయ్యడు. మీరేం చేస్తారో నాకు తెలియదు.. నా కొడుకు స్టేషన్ నుండి బయటకు రావాలి.. లేదంటే ఈ ఇంటి పరువు తీస్తానంటూ అనసూయ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఆ తర్వాత కార్తీక్ దగ్గరికి దీప వెళ్తుంది. మీరు కేసు ఎందుకు పెట్టారంటూ నీలదీస్తుంది. తనని బయటకు తీసుకొని రాకుంటే నాకు సాయం చేసినందుకు వాళ్ళ పరువు తీస్తానంటు మా అత్తయ్య బెదిరించిందని కార్తీక్ ని దీప తీసుకొని స్టేషన్ కి బయలుదేర్తుంది. మరొకవైపు బావ ఎంత మారిపోయాడో అర్థం చేసుకోమని సుమిత్రతో జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |